
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో రామ్ పోతినేని ఒకడు. ఇటు ‘బేబి’ సినిమాతో హిట్ హీరోయిన్ అనిపించుకుంది వైష్ణవి చైతన్య. రామ్ పై తనకున్న ప్రేమను మరోసారి బయటపెట్టింది ఈ బ్యూటీ.
రామ్ పోతినేని అంటే తనకు చాలా ఇష్టమని, కాలేజీ రోజుల్లో తన ఫస్ట్ క్రష్ రామ్ అని తెలిపింది వైష్ణవి. ‘జాక్’ సినిమా ప్రమోషన్ లో ఈ మేటర్ ను ఆమె వెల్లడించింది. నిజానికి వైష్ణవి ఇలా రామ్ పేరును బయటపెట్టడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. తన గత చిత్రం ప్రచారంలో కూడా ఇదే విషయాన్ని ఆమె వెల్లడించింది. అయితే ఈసారి అది ఎక్కువ వైరల్ అవుతోంది.
తన ఫస్ట్ క్రష్ తో పాటు మరిన్ని వ్యక్తిగత అభిరుచుల్ని బయటపెట్టింది ఈ బ్యూటీ. హైదరాబాద్ లో పుట్టిపెరిగిన వైష్ణవి, బిర్యానీ అంటే తనకు ఇష్టమని వెల్లడించింది. ఇక తన తొలి రెమ్యూనరేషన్ డీటెయిల్స్ కూడా బయటపెట్టింది.
కాలేజీ నుంచి బయటకొచ్చిన తర్వాత ఓ చిన్న షార్ట్ ఫిలింలో నటించినందుకు తనకు 3వేల రూపాయలిచ్చినట్టు గుర్తుచేసుకుంది. అనుష్క, సాయిపల్లవి, అలియాభట్ అంటే తనకు ఇష్టమని చెబుతున్న వైష్ణవి.. చిరంజీవి తనను జయసుధతో పోల్చడాన్ని జీవితంలో మరిచిపోలేనంటోంది.