
హీరోల కొడుకులు హీరోలుగా మారిన ఉదంతాలు కోకొల్లలు. కానీ హీరోయిన్ల కూతుళ్లు హీరోయిన్లుగా మారిన సందర్భాలు మాత్రం చాలా తక్కువ. చాలామంది సీనియర్ హీరోయిన్లు, తమ కూతుళ్లను ఇండస్ట్రీకి దూరంగానే పెంచారు. కానీ ఖుష్బూ అలా కాదు.
తెలుగు, తమిళ భాషల్లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఖుష్బూ, తన కూతుర్ని పరిశ్రమకు పరిచయం చేయబోతున్నట్టు తెలుస్తోంది. పెద్ద కూతురు అవంతిక ను ఓ తమిళ సినిమాతో హీరోయిన్ గా పరిచయం చేయాలని ఖుష్బూ భావిస్తున్నారు.
ఈ సినిమాకు ఖుష్బూ నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. ఇక ఖుష్బూ భర్త సుందర్.సి ఈ ప్రాజెక్టుకు దర్శకుడు. హారర్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాలో అవంతిక సరసన అధర్వను హీరో గా తీసుకోవాలని అనుకుంటున్నారట.
ఖుష్బూకు టాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు ఉంది. చేసినవి కొన్ని సినిమాలే అయినప్పటికీ ఆమె తెలుగు ప్రేక్షకులపై బలమైన ముద్ర వేశారు. సో.. కోలీవుడ్ ఎంట్రీ తర్వాత, కచ్చితంగా టాలీవుడ్ లో కూడా కూతుర్ని ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నారు ఖుష్బూ.