
క్యారెక్టర్ కొత్తగా లేకపోతే అస్సలు సినిమా చేయదు టబు. అవకాశాలు లేకపోతే ఇంట్లో రెస్ట్ తీసుకుంటాను తప్ప, రొటీన్ పాత్రలు మాత్రం చేయనని, ఆమె ఇటీవల క్లియర్ గా ప్రకటించింది. అందుకే ”అల వైకుంఠపురములో” సినిమా తర్వాత మళ్లీ ఆమె తెలుగులో కనిపించలేదు.
అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆ సినిమా వచ్చి దాదాపు ఐదేళ్లు దాటుతోంది. కానీ ఇప్పటివరకు మరో సినిమాలో కనిపించలేదు టబు. ఇన్నాళ్లకు మరో సినిమాకు ఓకే చెప్పింది ఈ సీనియర్ నటి.
డిఫరెంట్ స్టోరీ రాసుకొని విజయ్ సేతుపతిని ఒప్పించాడు పూరి జగన్నాధ్. దర్శకత్వం వహించడంతో పాటు, చార్మితో కలిసి ఆ సినిమాను నిర్మించబోతున్నాడు. అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇప్పుడీ సినిమాలో ఫిమేల్ లీడ్ కోసం టబును అనుకుంటున్నారు.
కథ కొత్తగా లేకపోతే సినిమా చేయని టబు, ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పిందంటే, పూరి రాసుకున్న కథ ఈసారి కొత్తగా ఉందని ఫిక్స్ అయిపోవచ్చు.

53 ఏళ్ల టబు తన నటనతో హాలీవుడ్ మేకర్స్ ను సైతం మెప్పించింది. డూన్ సిరీస్ తో పాటు రీసెంట్ గా క్రూ అనే సినిమాతో అందర్నీ ఆకట్టుకుంది. మళ్లీ ఇన్నేళ్లకు సౌత్ లో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో సినిమా చేయబోతోంది.