పవన్ ఇప్పటివరకు చాలా సినిమాలు చేశారు. కానీ ఆయన కెరీర్ లో ది బెస్ట్ మూవీగా నిలిచిపోతుందంట “ఉస్తాద్ భగత్ సింగ్.”
“గబ్బర్ సింగ్” తర్వాత పవన్-హరీశ్ కాంబోలో వస్తున్న సినిమా ఇది. ఈ సినిమాను పవన్ ఫ్యాన్స్ రిపీట్ మోడ్ లో చూస్తారని, తనది గ్యారెంటీ అంటున్నాడు హరీశ్.
“ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా, పవన్ ఫ్యాన్స్ అంతా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే సినిమా అవుతుంది. ఫ్యాన్స్ అంతా తమ మూవీ లైబ్రరీలో దీన్ని దాచుకుంటారు. వందల సార్లు రిపీట్ మోడ్ లో ఈ సినిమా చూసుకుంటారు. పవన్ నుంచి ఏం ఆశించి థియేటర్ కు వస్తారో అవన్నీ ఈ సినిమాలో ఉంటాయి. పూర్తిగా శాటిస్ ఫై అయి థియేటర్ నుంచి బయటకొస్తారు. ఇది ఫుల్ మీల్స్ కాదు, అంతకుమించి.”
ఇలా “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమాపై అంచనాలు పెంచేలా మాట్లాడాడు హరీశ్ శంకర్. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన గాజు గ్లాస్ డైలాగ్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. అది శాంపిల్ మాత్రమేనని, అలాంటి డైలాగ్స్ సినిమాలో చాలా ఉన్నాయని అంటున్నాడు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది “ఉస్తాద్ భగత్ సింగ్ “సినిమా. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే పవన్ ఈ సినిమా సెట్స్ పైకి రాబోతున్నాడు. ఆ “త్వరలోనే” అనేది ఎప్పుడో ఇప్పుడే చెప్పలేం.