మెగా కాంపౌండ్ నుంచి ఓ సినిమా వస్తుందంటే కచ్చితంగా ఆ కాంపౌండ్ హీరోల ప్రచారం ఉంటుంది. అలాంటిది తొలిసారి నిహారిక నిర్మాతగా మారి సినిమా చేస్తోందంటే, ప్రచారం పీక్స్ లో ఉండాలి. కానీ ఇప్పటివరకు అలాంటిదేం జరగలేదు.
నిహారిక నిర్మాతగా మారి తీసిన తొలి సినిమా “కమిటీ కుర్రాళ్లు.” ఈ సినిమా ప్రచారంలో ఒక్క మెగా హీరో కనిపించలేదు. చివరికి నిహారిక సొంత అన్నయ్య వరుణ్ తేజ్, వదిన లావణ్య త్రిపాఠి కూడా కనిపించలేదు.
దీనిపై నిహారిక స్వయంగా స్పందించింది.
“కష్టపడి సినిమా తీశాను. నేను ఒక్కదాన్నే ప్రచారం చేస్తున్నాను. సినిమా విడుదలకు ముందు మా ఫ్యామిలీ మెంబర్స్ తో ప్రమోషన్ అనుకున్నాను. చూస్తే, అన్నయ్య వైజాగ్ షూట్ లో బిజీగా ఉన్నాడు. వదిన కాలి గాయంతో డెహ్రాడూల్ లో ఉంది. పెదనాన్న చిరంజీవి, రామ్ చరణ్ పారిస్ ఒలింపిక్స్ కు వెళ్లారు. పవన్ కల్యాణ్ అస్సలు దొరకడం లేదు, చివరికి డాడీ కూడా రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఇలా నా సినిమా రిలీజ్ టైమ్ కు అంతా మాయమయ్యారు.”
ALSO CHECK: Niharika Sings “Pachadanamey”
అయితే రిలీజ్ టైమ్ కు ఎలాగైనా మెగా హీరోల్ని ప్రచారంలోకి తీసుకొస్తానంటోంది నిహారిక. చిరంజీవి, చరణ్ ఆల్రెడీ పారిస్ నుంచి ఇంటికొచ్చారు. కాబట్టి సినిమా ప్రచారం కోసం ఓ వీడియో చేయడం పెద్ద సమస్య కాదు.