ఈ వారం థియేటర్లలో కంటే ఓటీటీలో సినిమాలే ఆసక్తికరంగా ఉన్నాయి. ‘నరుడి బ్రతుకు నటన’, ‘పొట్టేల్’ లాంటి చిన్న సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవ్వగా.. ‘శ్వాగ్’, ‘సత్యం సుందరం’ లాంటి ఆసక్తిరక చిత్రాలు ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చాయి.
ఈ రెండు సినిమాలకు కొన్ని ప్రత్యేకతలున్నాయి.
ముందుగా ‘శ్వాగ్’ విషయానికొద్దాం. శ్రీవిష్ణు హీరోగా నటించిన ఈ సినిమాకు హసిత్ గోలి దర్శకుడు. సినిమాలో ఫుల్లుగా కామెడీ ఉంటుందని ఆశించిన ప్రేక్షకులు భంగపడ్డారు. ఎలాంటి అంచనాల్లేకుండా చూస్తే సినిమా చాలా కొత్తగా, ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందుకే ఈ మూవీ ఓటీటీలోకి వస్తే చూద్దామని చాలామంది వెయిటింగ్.
ఇక మరో సినిమా ‘సత్యం సుందరం’. గుండెల్ని పిండేసి, హృదయాల్ని కదిలించిన సినిమా ఇది. కార్తి, అరవింద్ స్వామి నటించిన ఈ సినిమాను చూస్తూ చాలామంది థియేటర్లలో కంటతడి పెట్టుకున్నారు కూడా.
అంతటి ఎమోషనల్ కంటెంట్ ఉన్న ఈ సినిమాను చూద్దామనుకునేలోపే థియేటర్ల నుంచి మాయమైంది. ఇప్పుడు ఓటీటీలో ప్రత్యక్షమైంది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ‘సత్యం సుందరం’, అమెజాన్ లో ‘శ్వాగ్’ స్ట్రీమింగ్ అవుతున్నాయి.