“టైటిల్ లో తిట్టు ఉంటే సినిమా సూపర్ హిట్”… దశాబ్దాల కిందట జంధ్యాల గారు రాసిన సూపర్ డైలాగ్ ఇది. ఈ డైలాగ్ ను నిజం చేస్తూ తర్వాత కాలంలో చాలా సినిమాలొచ్చాయి. ఇప్పుడు కొత్త ట్రెండ్ మొదలైంది. టైటిల్ లోనే నెగెటివ్ వైబ్ కనిపించాలి. అప్పుడే ఆడియన్స్ సినిమాకు ఎట్రాక్ట్ అవుతాడు.
ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, బాలయ్య సినిమాకు ‘డాకు మహారాజ్’ అనే టైటిల్ పెట్టారు. ఇదొక నెగెటివ్ టైటిల్. గతంలో ప్రజల్ని గడగడలాడించిన ఓ బందిపోటు పేరు ఇది. ఇలాంటి పేరును బాలకృష్ణ సినిమాకు పెట్టడంపై కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు.
అయితే దర్శకుడు బాబి మాత్రం దీన్ని సమర్థించుకున్నాడు. గతంలో ‘పోకిరి’ టైటిల్ తో సినిమా వచ్చినప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారని, సినిమా రిలీజైన తర్వాత ఆ టైటిల్ కరెక్ట్ అని అంగీకరించారని, ఇప్పుడు తన సినిమాకు కూడా ‘డాకు మహారాజ్’ అనే టైటిల్ కరెక్ట్ అని సినిమా చూసిన తర్వాత ఓ అభిప్రాయానికొస్తారని, అంతవరకు వేచి చూడాలని అంటున్నాడు.
‘డాకు మహారాజ్’ ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోతుందట. స్క్రీన్ లో సగం విలన్, సగం హీరో కనిపించిన షాట్ అదిరిపోయిందని చెబుతున్నాడు.