‘పుష్ప’ ఫ్రాంచైజీతో రష్మికకు ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు. దాదాపు నాలుగేళ్ల నుంచి ‘పుష్ప-1’, ‘పుష్ప-2’ సినిమాలపై ఆమె పనిచేస్తూనే ఉంది. ఇంకా చెప్పాలంటే, ఇప్పటికీ ఆమె ఆ ఫ్రాంచైజీకి పని చేస్తూనే ఉంది.
తాజాగా తన పోర్షన్ కు డబ్బింగ్ పూర్తిచేసిన రష్మిక.. సినిమాతో ఇక కనెక్షన్ ఉండదని తెలిసి ఎమోషనల్ అవుతోంది. ఈ సందర్భంగా పుష్పరాజ్ తో తనుకున్న అనుబంధాన్ని నెమరువేసుకుంటూ కొన్ని ఫొటోలు షేర్ చేసింది.
“పుష్ప-2 ట్రయిలర్ త్వరలోనే రాబోతోంది. ‘పుష్ప-1’ నుంచి నా జర్నీ చూసుకుంటే మీతో (అభిమానులు) పెద్దగా ఏమీ షేర్ చేసుకున్నట్టు లేదు. అందుకే ఈ ఫొటోలు రిలీజ్ చేస్తున్నాను.” అంటూ కొన్ని ఆసక్తిరక పిక్స్ పోస్ట్ చేసింది.
వీటిలో ఆన్ లొకేషన్ స్టిల్స్ నుంచి రష్యా పర్యటన వరకు చాలా ఫొటోలున్నాయి. సినిమా సెట్స్ నుంచి తను మేకప్ వేసుకుంటున్న స్టిల్స్ వరకు ఎన్నింటిలో తన ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది రష్మిక.