తెలుగు వారు మంచి ఆతిథ్యం ఇస్తారు. ఇక భోజన మర్యాదలతో అతిథులను ఆనందపరచడంలో గోదావరి ప్రాంతం వారు ప్రసిద్ధి. అలాంటి వారు మన సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. హీరోల్లో మొదట వినిపించే పేరు ప్రభాస్. ఆయన తన సినిమా షూటింగ్ లొకేషన్లో హీరోయిన్లకు, ఇతరులకు వడ్డించేందుకు ప్రత్యేకంగా తన ఇంట్లో చెఫ్స్ ని పెట్టుకున్నారు. వారు తయారు చేసిన భోజనం ప్రతిరోజూ వడ్డిస్తారు సెట్లో.
తాజాగా ఎన్టీఆర్ కూడా అలాగే చేస్తున్నారు. ఇటీవల జాన్వి కపూర్ ఎన్టీఆర్ మర్యాదల గురించి రాసింది. ఎన్టీఆర్ పంపించిన భోజనాల స్ప్రెడ్ ని ఇన్ స్టాగ్రామ్ లో చూపించింది. తాజాగా చిరంజీవి ఆతిథ్య మర్యాదలు ఎలా ఉంటాయో తెలిపింది త్రిష.
మెగాస్టార్ సరసన ఆమె “విశ్వంభర” సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం త్రిషకి సంబంధించిన సన్నివేశాలు తీస్తున్నారు. ఆమె కోసం మెగాస్టార్ ప్రత్యేకంగా ఇంటి నుంచి భోజనం పంపిస్తున్నారు. భోజనంతో తనని మెగాస్టార్ చంపేస్తున్నారు అంటూ ఆనందంగా పోస్ట్ చేసింది.
“ప్రతిరోజూ మెగాస్టార్ చిరంజీవి భోజన మర్యాదల వల్ల చెడిపోతున్నా” (Being spoilt rotten every day by the megastar (Sic)” అని రాసుకొంది. ఆ వంటకాలు అన్ని ఆరగించి తన ఫిట్నెస్ ని చెడగొట్టుకోవాల్సి వస్తుంది అనే అర్థంలో రాసింది.