
ఎదో రూపంలో సమంత పేరు ఎప్పుడూ వార్తల్లో మార్మోగుతూనే ఉంటుంది. ఆమె గత ఏడాది కాలంగా సినిమాల్లో నటించడం లేదు. అయినా ఆమె మీడియాలో నిత్యం వార్తే. తాజాగా సమంత వ్యక్తిగత జీవితం మళ్ళీ ఫోకస్ లోకి వచ్చింది.
సమంత – నాగ చైతన్య విడిపోయి మూడేళ్లు అయిపోతోంది. దానికి తోడు, నాగ చైతన్య ఇటీవల నటి శోభితతో నిశ్చితార్థం జరుపుకున్నారు. త్వరలోనే నాగ చైతన్య – శోభిత పెళ్లి జరగనుంది. సో, మరి సమంత పరిస్థితి ఏంటి? ఆమె జీవితంలోకి ఎవరు వచ్చారు అన్నదానిపై అందరిలో చర్చ జరుగుతోంది.
బాలీవుడ్ కి చెందిన వెబ్ సైట్లు తాజాగా సమంత డేటింగ్ చేస్తోందని రాస్తున్నాయి. రాజ్ – డీకే ద్వయంలోని రాజ్ తో ఆమె డేటింగ్ చేస్తోంది అని తాజాగా వార్తలు ప్రచురించాయి. ఐతే, ఇలాంటి ప్రచారం ఇప్పుడే కాదు సమంత డివోర్స్ వార్త బయటికి వచ్చినప్పటి నుండే ఉంది.
సమంత – నాగ చైతన్య ఎందుకు విడిపోయారు అనే విషయంలో రకరకాల వాదనలు ఉన్నాయి. సమంత రాజ్ తో సన్నిహితంగా ఉండడం ప్రధాన కారణం అనేది నాగ చైతన్య చెప్పింది అప్పట్లో.
“ది ఫ్యామిలీ మేన్ 2” వెబ్ సిరీస్ లో సమంత అప్పుడు నటించింది. ఆ టైంలోనే రాజ్ తో ఆమె సీరియస్ గా క్లోజ్ అయింది అని అప్పట్లో ప్రచారం జరిగింది. రాజ్ – డీకే “ఫ్యామిలీ మేన్”, “సిటాడెల్” వంటి వెబ్ సిరీస్ లు డైరెక్ట్ చేశారు. సమంత ఆ రెండు వెబ్ సిరీస్ ల్లో నటించింది. అలాగే “రక్త బ్రహ్మాండ” అనే మరో వెబ్ సిరీస్ ఒప్పుకొంది. దీనికి నిర్మాతలు రాజ్ -డీకే ద్వయమే. సో, రాజ్ తో ఉన్న “స్నేహం” లేదా “డేటింగ్” కారణంగానే సమంత వరుసగా వారితో ప్రాజెక్ట్ లు చేస్తోంది అనేది టాక్.

ఐతే, సమంత క్యాంప్ మాత్రం నాగ చైతన్య హీరోయిన్ శృతి హాసన్ తో అఫైర్ కొనసాగించాడు అని చెప్పింది. శృతి హాసన్ తో పాటు మరో హీరోయిన్ తో నాగ చైతన్య రహస్యంగా అఫైర్ లు పెట్టుకోవడం వల్లే వాళ్ళ ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయట.
ఈ వ్యవహారం అంతా మళ్ళీ ఫోకస్ లోకి రావడానికి కారణం నాగ చైతన్య – శోభిత నిశ్చితార్థమే. వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ఏమి జరిగిందో ఎవరూ చెప్పలేరు.