“కల్కి 2898 AD” సినిమాలో చాలామంది అతిథి పాత్రల్లో కనిపించారు. దీనికి సంబంధించి నాగ్ అశ్విన్ ట్రెండ్ సెట్ చేశాడని అంతా అంటున్నారు. అయితే సీనియర్ నటుడు సుమన్ మాత్రం ఈ ట్రెండ్ ను వ్యతిరేకిస్తున్నారు. పెద్ద స్టార్స్ చిన్న పాత్రల్లో కనిపిచడం బాధేసిందన్నారు.
“విజయ్ దేవరకొండ లాంటి స్టార్స్ కల్కిలో చిన్న పాత్రలో నటించడం నాకు బాధ అనిపించింది. అలాంటి వాళ్లు ఉన్నప్పుడు బాగా ఆశిస్తాం. అది లేనప్పుడు డిసప్పాయింట్ అవుతాం. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అలానే నిరాశపడి ఉంటారు. చాలామంది చేసే తప్పు పని ఏంటంటే.. స్టార్స్ ను పెట్టి సినిమా ఎనౌన్స్ చేసేస్తారు. ప్రేక్షకులు పరుగెత్తుకుంటూ వస్తారు. సినిమాలో ఆశించిన స్థాయిలో ఉండదు. దీంతో అంతా డిసప్పాయింట్ అవుతారు.”
అలాంటి అతిథి పాత్రలకు తను దూరమని స్పష్టం చేశారు సుమన్. ఇక కల్కి సినిమాలో తను చేయదగ్గ పాత్ర ఏదీ కనిపించలేదన్నారు.
రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి, విజయ్ దేవరకొండ చేసిన లాంటి అతిథి పాత్రలు తను చేయనని, తను ఓ పాత్ర చేస్తే నిలబడిపోవాలని అంటున్నారు. కల్కి సినిమాపై రివ్యూ ఇచ్చిన సుమన్, ఫస్టాఫ్ లో ఓ అరగంట ట్రిమ్ చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.