తెలుగులోనే రీసెంట్ గా సరైన హిట్స్ కొట్టలేకపోయాడు. అలాంటిది ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అంటున్నాడు. కిరణ్ అబ్బవరంకు ఇదంతా అవసరమా? చాలామందికి వచ్చిన బేసిక్ డౌట్ ఇది. దీనిపై కిరణ్ క్లారిటీ ఇచ్చాడు.
“పాన్ ఇండియా సినిమా తీయడానికి కావాల్సింది స్థాయి కాదు. కంటెంట్ ముఖ్యం. మంజుమ్మల్ బాయ్స్ పెద్ద హిట్టయింది. నటీనటులు ఎవరనేది ఎవ్వరికీ తెలియదు. కాంతార ముందు ఆ హీరో చాలామందికి తెలియదు. నా స్థాయి చిన్నదా, పెద్దదా అనేది సెకండరీ. నా సినిమాలో కంటెంట్ కు స్థాయి ఉందా లేదా అనేది మేటర్. క అనే సినిమాలో పాన్ ఇండియా కంటెంట్ ఉంది. అందుకే మిగతా భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నాం.”
ఇలా అందరి డౌట్స్ క్లియర్ చేశాడు కిరణ్ అబ్బవరం. “క” అనే పేరుతో ఒక కొత్త సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. ఆ సందర్భంగా ఇలా మాట్లాడాడు.
ALSO READ: Kiran Abbavaram’s ‘Ka’ teaser is out
‘క’ తర్వాత తను చేయబోయే సినిమాలో పాన్ ఇండియా కంటెంట్ లేదని, కాబట్టి ఆ సినిమాను కేవలం తెలుగులోనే రిలీజ్ చేస్తామని చెబుతున్నాడు కిరణ్ అబ్బవరం.