
‘తండేల్’ సినిమాలో సాయిపల్లవిని బుజ్జితల్లి అని పిలుస్తాడు నాగచైతన్య. కానీ నాగచైతన్య జీవితంలో అసలైన బుజ్జి తల్లి శోభిత. ఇక్కడ విషయం ఏంటంటే.. బయట కూడా శోభితను బుజ్జి తల్లి అనే పిలుస్తాడంట చైతూ.
ఈ విషయాన్ని స్టేజ్ పై దేవిశ్రీ ప్రసాద్ బయటపెట్టాడు.
అలా నాగచైతన్య రియల్ లైఫ్ బుజ్జితల్లి, తొలిసారి తన భర్తతో కలిసి బయటకొచ్చింది. ‘తండేల్’ సక్సెస్ సెలబ్రేషన్స్ లో నాగచైతన్యతో కలిసి పాల్గొంది శోభిత. చైతూ-శోభిత ఫొటోలు నిమిషాల వ్యవధిలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నాగచైతన్యతో పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో కాస్త జోరు తగ్గించింది శోభిత. ఒకప్పుడు రెగ్యులర్ గా పోస్టులు పెట్టే ఈ ముద్దుగుమ్మ, ప్రస్తుతం లిమిటెడ్ గా మాత్రమే పోస్టులు పెడుతోంది.
పెళ్లి తర్వాత కూడా ఆమె సినిమాల్లో కొనసాగుతుందని నాగచైతన్య గతంలోనే వెల్లడించాడు. అయితే శోభిత మాత్రం ఇప్పటివరకు తన కొత్త ప్రాజెక్టుల్ని ప్రకటించలేదు. ఇంకా ఆమె తన మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేసే ప్రాసెస్ లోనే ఉంది.