
తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం కార్తికి కొత్త కాదు. కానీ ఈసారి మాత్రం ఒకింత ఎమోషనల్ అయ్యాడు. దీనికి కారణం కొడుకు పుట్టిన తర్వాత తొలిసారి తనయుడితో కలిసి దర్శనానికి రావడం.
క్యూ లైన్లో కొడుకును ఎత్తుకొని కనిపించాడు కార్తి. పుట్టిన తర్వాత తొలిసారి తన కొడుక్కి స్వామివారి దర్శనం చేయించానని, చాలా ఆనందంగా ఉందని అన్నాడు. తొలిసారి కొడుకుతో కలిసి కనిపించడం మీడియా దృష్టిని ఆకర్షించింది.
ప్రస్తుతం ఈ హీరో “వా వాతియార్” అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ఇంకా తెలుగు టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఈ మూవీ తర్వాత ‘సర్దార్-2’, ‘ఖైదీ-2’ సినిమాలు వస్తాయంటున్నాడు ఈ నటుడు.
కార్తి-కృతి శెట్టి జంటగా తెరకెక్కింది “వా వాతియార్” సినిమా. ఇందులో కార్తీ పోలీసాఫీసర్ గా నటిస్తున్నాడు. సినిమాను పొంగల్ కానుకగా విడుదల చేయాలనుకున్నారు కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ సకాలంలో పూర్తికాకపోవడంతో రాలేదు.