శ్రియకు ఐటెంసాంగ్స్ కొత్త కాదు. ఒకప్పుడు ఆమె ఐటెం క్వీన్ గా ఓ వెలుగు వెలిగింది. చాలా ఐటెంసాంగ్స్ తో పాపులర్ అయింది.
ఈమధ్య కాలంలో అలాంటి పాటలకు ఆమె గ్యాప్ ఇచ్చింది. నిజానికి ఆమె గ్యాప్ ఇవ్వలేదు, మేకర్స్ ఆమెను తీసుకోవడం తగ్గించేశారు. అందం ఉన్నప్పటికీ, ఆకర్షణ చెక్కుచెదరనప్పటికీ శ్రియకు అవకాశాలు తగ్గాయి. అది సహజం.
ఇప్పుడీ ముద్దుగుమ్మ లాంగ్ గ్యాప్ తర్వాత ఓ స్పెషల్ సాంగ్ ఆఫర్ దక్కించుకుంది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూర్య ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో శ్రియను తీసుకున్నారు. ఆమెపై కొన్ని సన్నివేశాలున్నాయి. దాంతోపాటు స్పెషల్ సాంగ్ కూడా ఉంది.
తాజాగా జరిగిన ఊటీ షెడ్యూల్ లో శ్రియపై సన్నివేశాల చిత్రీకరణ పూర్తిచేశారు. త్వరలోనే చెన్నై శివార్లలో వేసే భారీ సెట్ లో సూర్య-శ్రియపై ఓ స్పెషల్ సాంగ్ తీయబోతున్నారు. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.
మున్నా, దేవదాసు, బాస్, తులసి, పులి లాంటి ఎన్నో సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది శ్రియ. తమిళ్, హిందీ భాషలతో కలుపుకుంటే, ఆమె చేసిన స్పెషల్ సాంగ్స్ లిస్ట్ చాలా పెద్దది. మళ్లీ ఇన్నేళ్లకు ఆమె సూర్య సినిమాలో స్సెషల్ సాంగ్ చేస్తోంది.