ఔటర్ రింగ్ రోడ్డులో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లే కార్లను చూశాం. కొంతమంది 150 కూడా ట్రై చేసిన వాళ్లున్నారు. మరి 234 కిలోమీటర్ల వేగంతో ఎవరైనా వెళ్లగలరా? అజిత్ ఆ స్పీడ్ టచ్ చేశాడు. ఇదేదో సినిమా స్టంట్ కాదు, రియల్ గా జరిగిన మేటర్.
అజిత్ కు కార్ రేసులు, బైక్ రైడింగ్స్ అంటే ఇష్టమనే సంగతి తెలిసిందే. మంచి కారు దొరికితే అజిత్ ను ఆపడం కష్టం. ఇది అలాంటి సందర్భమే.
ఆడీ కారులో అజిత్ రయ్ మంటూ దూసుకుపోయాడు. ఏకంగా 234 కిలోమీటర్ల స్పీడ్ టచ్ చేశాడు. నిజానికి ఇండియాలో ఇలా చేయడం నేరం కింద పరిగణిస్తారు. కానీ అజిత్ ఈ పని చేసింది ఇండియాలో కాదు. తన విదేశీ పర్యటనలో భాగంగా ఇలా కారులో 234 కి.మీ స్పీడ్ లో ప్రయాణించాడు అజిత్.
ప్రస్తుతం అజిత్ “విడాముయార్చి”, “గుడ్ బ్యాడ్ అగ్లీ” సినిమాలు చేస్తున్నారు. వీటిలో విడాముయార్చి సినిమా ముందుగా రిలీజ్ అవుతోంది. ఇందులో త్రిష, రెజీనా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇది కూడా యాక్షన్ సినిమానే.