రాజకీయాల్లో పవన్ కల్యాణ్ సాధించిన విజయాలపై పొంగిపోతోంది ఆయన సరసన నటించిన హీరోయిన్ శ్రియా శరణ్. పవన్ ఏదో ఒక రోజు రాజకీయాల్లో తన మార్క్ చూపిస్తారని తను భావించానని, ఇప్పుడదే నిజమైందని అంటోంది.
“చాలా అద్భుతమైన విజయం అది. నేను విన్నాను. ఆయన ఎప్పుడూ ప్రజలకు ఏదో చేయాలనే తపనతో ఉండేవారు. ఎట్టకేలకు ప్రజలు ఆయన్ను ఎన్నుకున్నారు. రాజకీయాల్లో ఆయన కచ్చితంగా అద్భుతాలు చేస్తారనే నమ్మకం నాకుంది.”
షూటింగ్ టైమ్ లో ఎప్పుడూ సైలెంట్ గా, ఓ కార్నర్ లో కూర్చొని ఆయన ఆలోచిస్తూ ఉండేవారని.. చాలా హార్డ్ వర్క్ చేస్తారని మెచ్చుకుంది శ్రియ.
“బాలు” సినిమా షూటింగ్ లో పవన్ గాయమైన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది. సాంగ్ షూట్ లో పవన్ కు దెబ్బ తగిలిందని, కానీ ఆ విషయం ఎవ్వరికీ చెప్పకుండా షూటింగ్ చేశారని చెప్పుకొచ్చింది.
టాలీవుడ్ లో మరోసారి సీనియర్ హీరోలతో నటించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది శ్రియ. కుదిరితే చిరంజీవితో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్టు తెలిపింది.