
శ్రేయ ఘోషల్ గొప్ప గాయని. దేశంలో నెంబర్ వన్ సింగర్. ఎలాంటి పాటనైనా పాడగల విలక్షణ గాయని ఆమె. మధురమైన, శ్రావ్యమైన గీతాలతో పాటు ఐటమ్ సాంగ్స్ కూడా ఆమె చాలానే పాడిన శ్రేయ ఘోషల్ ఇప్పుడు బాధపడుతున్నట్లు కనిపిస్తోంది.
“చికిని చమేలిలాంటి కొన్ని పాటలు కాస్త సభ్యత హద్దు దాటిపోయినట్లు ఇప్పుడు అనిపిస్తోంది. అమ్మాయిల అందం గురించి వర్ణించడం వేరు, వాళ్ళని సెక్స్ బొమ్మలుగా చూపించడం వేరు. ఆ రెండింటి మధ్య సన్నని గీత ఉంది.కొన్ని పాటల్లో ఆ గీత చెరిగిపోయింది. ఈ మధ్య 5, 6 ఏళ్ల అమ్మాయిలు నా దగ్గరికి వచ్చి ఈ పాట అంటే మాకిష్టం అని పాడుతుంటే నేను సిగ్గుతో చచ్చిపోతున్నాను,” అని శ్రేయ పేర్కొంది.
గాయనిగా అన్ని పాటలు పాడాలి. తప్పదు. కానీ, చిన్న పిల్లలు తన సెక్సీ పాటలను అనుకరించినప్పుడు ఇబ్బందికరంగా ఉంటుంది అని ఆమె చెప్తోంది.
తెలుగులో ఆమె ఈ మధ్య “సూసెకి” (పుష్ప 2″), “హైలెస్సో” (తండేల్), “నానా హైరానా” (గేమ్ ఛేంజర్) వంటి హిట్ సాంగ్స్ పాడారు శ్రేయ ఘోషల్.