
తన సినిమాలు, అవి సృష్టించిన రికార్డులతోనే జాతీయస్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో రాజమౌళి ఇప్పటివరకు పేరు తెచ్చుకున్నారు. జాతీయ స్థాయి మీడియాలో ఆయనకి సంబంధించి ఇంతకుముందు ఎక్కువగా నెగిటివ్ వార్తలు కానీ వివాదాలకు సంబంధించి వార్తలు కానీ రాలేదు.
మొదటిసారి ఆయన పేరు నెగిటివ్ వార్తతో జాతీయ స్థాయిలో మార్మోగింది. ఆయన ఒకప్పటి మిత్రుడు ఉప్పలపాటి శ్రీనివాసరావు చేసిన ఆరోపణలను జాతీయ మీడియా ప్రముఖంగా కవర్ చేసింది. రాజమౌళి, తాను, ఇంకో వ్యక్తిది “ఆర్య 2″లాంటి లవ్ స్టోరీ అని, ఇంకా ఇతర ఆరోపణలు చేసిన శ్రీనివాసరావు వీడియో బాగా కలకలం రేపింది.
అయినా ఇప్పటివరకు రాజమౌళి కానీ, ఆయన టీం కానీ ఇంతవరకు స్పందించలేదు. పూర్తిగా మౌనం వహించింది. శ్రీనివాసరావు అనే అతను చేసిన కామెంట్స్ ని “పిచ్చి కామెంట్స్”గా ప్రధాన మీడియా భావించి వాటికి “కవరేజ్” ఇవ్వలేదు. రాజమౌళి టీం కూడా పట్టించుకోవడం లేదు.
ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో సినిమా తీస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.