“సాహో” బ్యూటీ శ్రద్ధా కపూర్ గురించి పరిచయం అక్కర్లేదు. తన లుక్స్ తో, లేటెస్ట్ ఫొటోస్ తో ఎప్పటికప్పుడు అందర్నీ ఎట్రాక్ట్ చేస్తూనే ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం డేటింగ్ లో ఉన్న సంగతి కూడా తెలిసిందే.
రైటర్ రాహుల్ మోడీతో ఆమె ప్రేమాయణం సాగిస్తోంది. మొన్నటివరకు సీక్రెట్ గా ఇద్దరూ కలిసి విదేశాలకు వెళ్లేవారు. ఇప్పుడు ఇండియాలో బహిరంగంగానే తిరుగుతున్నారు. అంబానీ పెళ్లి వేడుకకు కూడా ఇద్దరూ కలిసే వచ్చారు.
ఈ క్రమంలో పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది శ్రద్ధా కపూర్ కి. ఆమె ప్రస్తుతం “స్త్రీ-2” అనే సినిమా చేస్తోంది. ఈ సినిమాకు, తన పెళ్లికి ముడిపెడుతూ సమాధానమిచ్చింది ఈ బ్యూటీ. “ఆమె ఒక స్త్రీ. ఆమెకు ఎప్పుడు నచ్చితే అప్పుడు పెళ్లి కూతురుగా మారుతుంది” అంటూ గమ్మత్తుగా సమాధానమిచ్చింది.
ఆమె ఇచ్చిన చమత్కారమైన సమాధానానికి నెటిజన్లు షాక్ అయ్యారు. ఎవరికి తోచిన విధంగా వాళ్లు దాన్ని అన్వయించుకుంటున్నారు.