భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు బోల్తాకొట్టడం అప్పుడప్పుడు జరుగుతుంది. అయితే అది ఎందుకు ఫెయిలైందనే విశ్లేషణలు మాత్రం వెంటనే రావు. సందర్భానుసారం బయటకొస్తుంటాయి. ఇది కూడా అలాంటిదే.
చిరంజీవితో జై చిరంజీవ అనే సినిమా చేశాడు దర్శకుడు విజయభాస్కర్. అప్పట్లో భారీ అంచనాలతో వచ్చిన ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఆ మూవీ పరాజయంపై తాజాగా మరోసారి స్పందించాడు దర్శకుడు. చిరంజీవి సామర్థ్యానికి, తమ సెన్సిబిలిటీస్ కు మ్యాచ్ అవ్వలేదన్నాడు.
“చిరంజీవి క్యాపబులిటీస్ కు, మా సెన్సిబిలిటీస్ మ్యాచ్ చేయడానికి ప్రయత్నించాం. కొంచెం కుదరలేదు. ఇది జస్ట్ చిన్న బెండు మాత్రమే, ఎండ్ కాదు. ఇంకోసారి ప్రయత్నిస్తే ఈసారి హిట్ కొట్టోచ్చేమో. అలా సక్సెస్ అయిన వాళ్లు చాలామంది ఉన్నారు. ఆ టైమ్ కు చిరంజీవితో కుదరలేదంతే.”
పరాజయాన్ని సీరియస్ గా తీసుకోకూడదంటున్నాడు విజయ్ భాస్కర్. ప్రతి టెక్నీషియన్ కెరీర్ లో ఒక పీక్ పీరియడ్, ఒక వీక్ పీరియడ్ ఉంటాయని.. పీక్ పీరియడ్ లో ఉన్నప్పుడు డోంట్ స్పీక్ (మాట్లాడొద్దు).. వీక్ లో ఉన్నప్పుడు డోంట్ వీప్ (ఏడవద్దు) అని అంటున్నాడీ దర్శకుడు.