హీరోయిన్ల కెరీర్ చాలా చిన్నది. ఉన్న కెరీర్ లోనే క్రేజ్ తో పాటు కాసులు వెనకేసుకోవాలి. అయితే ఇప్పుడు హీరోయిన్లకు రీఎంట్రీ అనే ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన హీరోయిన్లంతా ఇప్పుడు రీఎంట్రీ ఇస్తున్నారు. ఒకప్పటి హీరోయిన్ సాయేషా కూడా అదే బాటలో నడుస్తోంది.
తన రీఎంట్రీ కోసం ఈమె చాలా పెద్ద ప్లాన్ వేసింది. ముందుగా సోషల్ మీడియాలో యాక్టివ్ అవ్వడం మొదలుపెట్టింది. తనలో ఇంకా గ్లామర్ తగ్గలేదని, డాన్స్ లో గ్రేస్ అలానే ఉందని చూపించే ప్రయత్నం చేస్తోంది. ఆ తర్వాత రీఎంట్రీని ఘనంగా ప్రకటించాలని అనుకుంటోంది.
భర్త ఆర్య సినిమాతో సాయేషా రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. ఒకప్పటి హీరోయిన్లంతా ఇప్పుడు క్యారెక్టర్ రోల్స్ లోకి మారుతుంటే, సాయేషా మాత్రం మరోసారి హీరోయిన్ గానే అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.
తెలుగులో “అఖిల్” సినిమాతో ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అది పెద్ద డిజాస్టర్ అయింది. ఆ తర్వాత తమిళ్ లో 2-3 సినిమాలతో పేరు తెచ్చుకుంది. కార్తి లాంటి హీరోలు ఈమెకు సక్సెస్ అందించారు. అదే టైమ్ లో ఆర్యతో ప్రేమలో పడి, అతడ్నే పెళ్లి చేసుకుంది. ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చి, ఇప్పుడు రీఎంట్రీ ఆలోచనలో ఉంది.