హీరోయిన్లపై పుకార్లు చాలా కామన్. నిధి అగర్వాల్ కూడా ఈ లిస్ట్ లోకి చేరిపోయింది. డేటింగ్ కింగ్ శింబుతో ఈమె ప్రేమాయణం సాగిస్తోందనేది తాజా పుకార్ల సారాంశం.
అక్కడితో ఈ కథనాలు ఆగలేదు. ఇద్దరూ పెళ్లి పీటల వరకు వెళ్లబోతున్నారని కోలీవుడ్ కోడై కూస్తోంది.
శింబుకు 41, నిధికి 31. ఇద్దరి మధ్య పదేళ్లు గ్యాప్ ఉన్నప్పటికీ మనసులు మాత్రం మంచిగా కలిసిపోయాయంటోంది కోలీవుడ్ మీడియా. ఇక పెళ్లి చేసుకోవడం ఒక్కటే బ్యాలెన్స్ అని, అందుకే నిధి సినిమాలు తగ్గించిందని కూడా అంటున్నారు.
కెరీర్ లో ఇప్పటికే సరైన హిట్ లేక ఇబ్బంది పడుతోంది నిధి అగర్వాల్. ఇప్పుడీ పుకార్లపై ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో “హరిహర వీరమల్లు”, “రాజా సాబ్” సినిమాలున్నాయి. వీటిలో “హరిహర వీరమల్లు” ముందుగా థియేటర్లలోకి వస్తుంది. ఆ తర్వాత కొన్ని రోజులకే రాజాసాబ్ కూడా రిలీజ్ అవుతుంది.