
రష్మిక మందాన వయసు 28 ఏళ్ళు. బాలీవుడ్ సీనియర్ హీరో సల్మాన్ ఖాన్ వయసు 59 ఏళ్ళు. మరో ఏడాదిలో సల్మాన్ సీనియర్ సిటిజెన్ జాబితాలో చేరుతారు. సల్మాన్, రష్మిక మధ్య 31 ఏళ్ల వ్యత్యాసం ఉంది. తన కన్నా 31 ఏళ్ల చిన్న హీరోయిన్ తో జతకట్టడం గురించి ప్రశ్న ఎదురు కావడంతో సల్మాన్ గట్టిగా సమాధానం ఇచ్చారు.
“రష్మికకి నాతో నటించడం ఎలాంటి ఇబ్బంది లేదు. నా వయసుతో ఆమెకి సమస్య లేదు. ఆమె పేరెంట్స్ కి అభ్యంతరం లేదు. మీకు (జర్నలిస్ట్ లకు) ఏంటి సమస్య,” అని సల్మాన్ ఖాన్ జవాబు ఇచ్చారు.
సల్మాన్ ఖాన్ ఇలా సమాధానం చెప్తున్నప్పుడు రష్మిక గట్టిగా నవ్వింది. ఆమె ఆ ప్రశ్నని పొడగించకుండా తల పక్కకు తిప్పుకొని నవ్వేసింది.
రష్మిక, సల్మాన్ ఖాన్ కలిసి “సికిందర్” సినిమాలో నటించారు. ఈ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది. తెలుగులోకూడా వెంకటేష్, బాలకృష్ణ, చిరంజీవి వంటి హీరోలకు కూడా ఈ సమస్య ఉంది. కానీ ఇక్కడ హీరోలను అడిగే ధైర్యం చేయలేదు మీడియా.