Skip to content
telugu.telugucinema.com telugu.telugucinema.com

  • హోమ్
  • న్యూస్
  • ఫీచర్లు
  • అవీ ఇవీ
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • రివ్యూలు
  • వీడియోలు
  • English
telugu.telugucinema.com
telugu.telugucinema.com

పూజ హెగ్డేకి లాభం దక్కిందా?

Cinema Desk, May 3, 2025May 3, 2025
Pooja Hegde

పూజ హెగ్డేకి కెరీర్ దాదాపుగా ముగిసింది. ఆమెకి తెలుగులో గత రెండేళ్లలో ఒక్క ఆఫర్ రాలేదు. ఐతే, లక్కీగా ఆమెకి తమిళంలో మూడు, నాలుగు బడా సినిమాలు దక్కాయి. అందులో మొదటిది… రెట్రో. సూర్య హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా రూపొందిన ‘రెట్రో’ మే 1న విడుదలైంది. తెలుగులో దారుణంగా పరాజయం పాలైంది.

తమిళంలో ఈ సినిమాకి మిశ్రమ స్పందన దక్కింది. ప్లాప్ కాదు అలాగనీ బ్లాక్ బస్టర్ కాదు. ఓపెనింగ్ కలెక్షన్స్ బాగున్నాయి. దీని పూర్తి ఫలితం సోమవారం తర్వాతే తేలుతుంది.

ఈ సినిమా ఆడకపోతే సూర్యకి దెబ్బే కానీ సూర్య కన్నా పూజ హెగ్డేకి పెద్ద సమస్య అవుతుంది. ఐతే, ఆమె కూడా సోమవారం తర్వాత ఫలితం ఎలా ఉంటుందో చూడాలని అనుకుంటోంది.

వచ్చే జనవరికి ఆమె నటించిన “జన నాయగన్” విడుదల అవుతుంది. ఇందులో విజయ్ హీరో. విజయ్ కి ఇదే చివరి చిత్రం. ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలపై ఫోకస్ ఉంటుంది. అందుకే “జన నాయగన్”పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాపై ఆమె ఆశలు పెట్టుకోవచ్చు.

నిజానికి “రెట్రో” చిత్రంలో డీగ్లామ్ పాత్రలో పూజ బాగా ఒదిగిపోయింది. ఇప్పటివరకు ఆమె చేసిన పాత్రలకు భిన్నంగా కనిపించింది. నటిగా కూడా మెప్పించింది. కానీ ఫలితం మాత్రం అనుకున్నంతగా దక్కలేదు.

అవీ ఇవీ Pooja HegdeRetroRetro Movie

Post navigation

Previous post
Next post

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఇవీ చదవండి

  • Samantha
    మొదటి సినిమాతో ‘సేఫ్’
  • South Indian Heroes
    సౌత్ అగ్ర హీరోల పారితోషికాలు!
  • Sreeleela
    100లో ఒకరు ఈ కసక్
  • Ram Charan wax
    చరణ్ విగ్రహంతో మెగా ఫ్యామిలీ
  • Amala Paul
    గుడ్ జోక్ అమలా పాల్!
  • Sumanth
    ఒంటరిగా వెళ్తా, ఒంటరిగా ఉంటా!
  • Vennela Kishore
    నా డ్రీంరోల్ చేసేశా: వెన్నెల కిషోర్
  • Eesha Rebba
    ఈ భామ ఆశలు వదిలేసిందా?
  • Pooja Hegde
    ఆమెని చాలా బ్యాడ్ చేశారట!
  • Aarti Ravi letter
    బాధ్యతలు మరిచిన హీరో!
  • Manchu Vishnu and Manchu Manoj
    మనోజ్ ది ఉంది, విష్ణుది లేదు!
  • Megastar Chiranjeevi
    చిరంజీవి ఈ కల నెరవేరేనా?
  • VD14 and VD15
    దేవరకొండ సినిమాల హంగామా
  • Samantha
    ఇదే సమంత అభిమానుల చింత
  • Faria Abdullah
    డ్రీం డేటింగ్, వెడ్డింగ్!

ఇతర న్యూస్

  • మొదటి సినిమాతో ‘సేఫ్’
  • సౌత్ అగ్ర హీరోల పారితోషికాలు!
  • 100లో ఒకరు ఈ కసక్
  • చరణ్ విగ్రహంతో మెగా ఫ్యామిలీ
  • గుడ్ జోక్ అమలా పాల్!
©2025 www.telugucinema.com. All Rights reserved.
Privacy Policy | Disclaimer | About Us | Contact Us