
కాయదు లోహర్… ఇటీవల కుర్రకారు కన్నుకి నచ్చిన సుందరి. తమిళ యువ హీరో ప్రదీప్ రంగనాథన్ సరసన “రిటర్న్ ఆఫ్ డ్రాగన్” అనే చిత్రంలో నటించింది. అనుపమ ఒక హీరోయిన్ కాగా కాయదు లోహర్ మరో భామ. ఆమె అందచందాలు యువ ప్రేక్షకులను గిలిగింతలు పెట్టాయి. దాంతో ఆమెకి తమిళనాడులో క్రేజ్ వచ్చింది.
కాయదు ఇప్పుడు రెండో పెద్ద సినిమా ఒప్పుకొంది. శింబు హీరోగా రూపొందుతోన్న ఆయన 49వ చిత్రంలో కాయదు హీరోయిన్. ఈ సినిమా ఈ రోజు లాంఛనంగా ప్రారంభం అయింది. శింబు సరసన ఛాన్స్ రావడంతో ఆమెకి మరిన్ని బడా ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు.
పాతికేళ్ల ఈ సుందరి మూడేళ్ళ క్రితం “అల్లూరి” అనే తెలుగు సినిమాలో నటించింది. శ్రీ విష్ణు హీరోగా నటించాడు అందులో. కానీ ఆ సినిమా ఆడలేదు. తెలుగు జనం కూడా ఆమెని పట్టించుకోలేదు. తమిళంలో నటించి క్రేజ్ తెచ్చుకొంది. ఇప్పుడు రెండు సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి.
ఈ భామ తెలుగులో కూడా అవకాశాల కోసం చూస్తోంది. ఇప్పటికే మలయాళంలో రెండు సినిమాలు చేసింది.