
హీరో సుధీర్ బాబు మొన్నటివరకు “నైట్రో స్టార్” (Nitro Star) అని తన పేరు ముందు పెట్టుకునేవాడు. మెగాస్టార్, సూపర్ స్టార్ లా “నైట్రో స్టార్” అనే ట్యాగ్ వేసుకున్నాడు. జనం నవ్వారు. ఐతే, ఆ ట్యాగ్ పెట్టుకున్న తర్వాత ఒక్క సినిమా ఆడలేదు. పైగా విడుదలనవన్నీ బాక్సాఫీస్ వద్ద పేలిపోయాయి.
దాంతో “నైట్రో”ని పక్కన పెట్టాడు. ఇప్పుడు “నవ దళపతి” (Nava Dhalapathy) అని జత చేశాడు.
ఇక నుంచి అతని పేరు ముందు ‘నవ దళపతి’ అని ఉంటుంది. తమిళ సినిమా రంగంలో విజయ్ ని దళపతి విజయ్ అని పిలుస్తారు. అందుకే, ఇతను ‘నవ’ అని యాడ్ చేశాడు. మరి సుధీర్ బాబు విజయ్ లా పెద్ద హీరో అవుతాడా? పెద్ద హిట్స్ అందిస్తాడా అనేది చూడాలి. కాలమే సమాధానం ఇస్తుంది.
కొత్తగా “జటాధర’ అనే సినిమా చేస్తున్నాడు. అది కూడా పాన్ ఇండియా లెవల్లో.