నాగ చైతన్యకి రొమాంటిక్ హీరో ఇమేజ్ ఉంది. లవర్ బాయ్ గానే విజయాలు అందుకున్నాడు. చైతన్య నటించిన యాక్షన్ చిత్రాలను ప్రేక్షకులు తిప్పికొట్టారు. ఐతే, ఇప్పుడు తాను గతంలో చేసినట్లు పూర్తి స్థాయి లవర్ బాయ్ పాత్రలు చెయ్యనంటున్నాడు.
చైతన్య ఇప్పుడు మేన్లీగా తనను తాను ప్రెజెంట్ చేసుకుంటున్నాడు. పూర్తిగా యాక్షన్ సినిమాలు కాకుండా, ఇటు లవ్ స్టోరీలు కాకుండా రెండు మిక్స్ చేస్తూ వైవిధ్యమైన కథలు ఎంచుకుంటున్నాడు.
నాగ చైతన్య ఇకపై “ప్రేమమ్”, “మనం”, “లవ్ స్టోరీ” వంటి సినిమాలు చెయ్యడంట. “తండేల్” వంటి భారీ పాన్ ఇండియా చిత్రాల వైపు మొగ్గు చూపుతున్నాడు. తన వద్దకు వచ్చే దర్శక, నిర్మాతలకు ఇదే ముచ్చట చెప్తున్నాడట. భారీగా ఉండే, వైవిధ్యంగా ఉండే కథలు తీసుకురండి అని నిర్మాతలకు క్లారిటీ ఇచ్చాడట.
నాగ చైతన్య వయస్సు ఇప్పుడు 37 ఏళ్ళు. ఇక ఇప్పుడు అబ్బాయిగా కాకుండా “మగధీరుడు”గా మెప్పించాలని అనుకుంటున్నాడు.