హీరోయిన్ మృణాల్ ఠాకూర్… కోలీవుడ్ లో అడుగుపెట్టేందుకు లైన్ క్లియర్ అయింది.తమిళ ఇండస్ట్రీలో కాలుమోపాలని చాన్నాళ్లుగా ఎదురుచూస్తోంది. కానీ సరైన ప్రాజెక్టు సెట్ అవ్వక వెనకడుగు వేసింది. ఎట్టకేలకు ఆ అవకాశం రానే వచ్చింది.
ఆర్ జే బాలాజీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు సూర్య. ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ను తీసుకున్నారు అని టాక్. కోలీవుడ్ లో ఆమెకిదే తొలి సినిమా కావడం విశేషం.
నిజానికి గతంలోనే మృణాల్ పేరు తెరపైకొచ్చింది. ‘కంగువ’లో ముందుగా ఆమెనే హీరోయిన్ గా అనుకున్నారు. ఆఖరి నిమిషంలో దిశా పటానీ వచ్చి చేరింది. ఇప్పుడు మృణాల్ కు ఛాన్స్ ఇచ్చాడు సూర్య.
అయితే ఈ సినిమాలో మృణాల్ సోలో హీరోయిన్ కాదు. ఇందులో ఆల్రెడీ రుక్మిణి వసంత్ ను హీరోయిన్ గా తీసుకున్నారట తాజాగా మృణాల్ ను కూడా ఎంపిక చేశారు. మంచి పాత్ర దొరకడంతో మృణాల్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.
ALSO READ: Mrunal Thakur shares BW images
ప్రస్తుతం ‘కంగువా’ ప్రమోషన్స్ తో సూర్య బిజీగా ఉన్నాడు. ఆ సినిమా రిలీజ్ తర్వాత ఆర్ జే బాలాజీ సినిమాపై మరిన్ని వివరాలు బయటకొచ్చే అవకాశం ఉంది.