మేకోవర్ లో ఉన్నప్పుడు హీరోలు చాలా జాగ్రత్తగా ఉంటారు. తమ లుక్ బయటకు రాకుండా అన్ని రకాల ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటారు. ఈ క్రమంలో రామ్ చరణ్ కూడా ఇన్నాళ్లూ బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్నాడు. కానీ ఇప్పుడు చరణ్ నయా లుక్ బయటపడింది.
బుచ్చిబాబు సినిమా కోసం మేకోవర్ అవుతున్న విషయాన్ని చరణ్ ఇదివరకే బయటపెట్టాడు. ‘రంగస్థలం’ తర్వాత మరోసారి రూరల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తున్న చరణ్, ఆ మూవీ కోసం సరికొత్త లుక్ లోకి మారేందుకు ప్రయత్నిస్తున్నాడు.
ఈమధ్య రోల్స్ రాయిస్ కారు కొన్నాడు చరణ్. ఆ కారు రిజిస్ట్రేషన్ పని మీద అతడు హైదరాబాద్ లోని ఆర్టీఏ ఆఫీస్ కు వెళ్లాడు. సరిగ్గా అక్కడ చరణ్ నయా లుక్ బయటపడింది. స్టయిలిష్ గా కనిపిస్తూనే, కాస్త రఫ్ గా ఉన్నాడు చరణ్.
నిజానికి ఇది ఫైనల్ లుక్ కాదు. ఇంకా చాలా మేకోవర్ అవ్వాల్సి ఉంది. కాబట్టి అప్పుడే చరణ్ లుక్ పై ఓ అభిప్రాయానికి రావడం కరెక్ట్ కాదు. జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రాబోతోంది. మొదటి షెడ్యూల్ ను మైసూర్ లో ప్లాన్ చేశారు.