పోలీసులకు అందుబాటులోకి రాకుండా మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్లారన్న ప్రచారం పూర్తిగా తప్పు అని తేలింది. ఈ రోజు ఆయనని పోలీసులు కలిశారు. విచారణ మొదలుపెట్టారు.
ప్రస్తుతం తన ఆరోగ్యం బాలేదని, కోలుకున్న తర్వాత విచారం చెయ్యండి అని మోహన్ బాబు పోలీసులను కోరారు. కానీ ఇప్పుడే విచారించాలి, సహకరించండి అంటూ పోలీసులు కోరడంతో మోహన్ బాబు అంగీకరించారు. ప్రస్తుతం విచారణ జరుగుతోంది.
మోహన్ బాబుకి గన్ లైసెన్స్ ఉంది. కేసు నమోదు అయిన నేపథ్యంలో పోలీసులు తుపాకిని హ్యాండోవర్ చెయ్యమని అడిగారు. సాయంత్రం లోపు ఇస్తాను అని మోహన్ బాబు చెప్పడంతో పోలీసులు అంగీకరించారు.
మోహన్ బాబు, ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్ మధ్య వివాదం నడుస్తోంది. తన ఇంటికి వచ్చిన మీడియాపై మోహన్ బాబు దాడి చేశారు. టీవీ9 రిపోర్టర్ కి గాయాలు అయ్యాయి. దాంతో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు అయింది. దాంతో పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు, తాను కోరిన ముందస్తు బెయిల్ ని కోర్టు నిరాకరించలేదు అని మోహన్ బాబు చెప్తున్నారు. అది ఇంకా విచారణలో ఉంది.