రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘గేమ్ చేంజర్’. ఈ సినిమా ప్రమోషన్స్ ఆల్రెడీ మొదలయ్యాయి. తాజాగా శ్రీకాంత్ మాట్లాడాడు. సినిమాలో తన పాత్రతో పాటు, మరిన్ని వివరాల్ని వెల్లడించాడు.
– దర్శకుడు శంకర్, గేమ్ చేంజర్ కథ ఫస్ట్ హాఫ్ నెరేషన్ ఇస్తున్నప్పుడు ఈ పాత్రను నాకు ఎందుకు చెబుతున్నారు అనుకున్నాను. సెకండాఫ్ చెప్పిన తరువాత ఈ పాత్రను కచ్చితంగా నేనే చేయాలని అనుకున్నాను. నా కారెక్టర్ అంత బాగా ఉంటుంది. గెటప్ కూడా చాలా కొత్తగా ఉంటుంది.
– ప్రోస్థటిక్ మేకప్‌కే 4 గంటలు పట్టేది. నేను ఇంత వరకు ప్రోస్థటిక్ మేకప్ వేసుకుని నటించలేదు. అలాంటి మేకప్ ధరించి నటించడం చాలా కష్టం. చెమటలు పట్టినా మేకప్ మారిపోతుంది.
– గేమ్ ఛేంజర్ లో నాది పాజిటివ్ క్యారెక్టరా.. నెగెటివ్ పాత్రా అనేది ఇప్పుడే చెప్పను. కాకపోతే నా పాత్రలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. చాలా సస్పెన్స్‌లు ఉంటాయి. అవన్నీ చెప్పొద్దని అన్నారు.
– నా తండ్రి ఫొటో చూసి నాకీ లుక్ ఫిక్స్ చేశారు. గెటప్ వేసుకుని నేరుగా ఇంటికి వెళ్లాను. మా అమ్మ నన్ను చూసి షాక్ అయ్యారు. హేయ్ బేబీ (నవ్వుతూ) అని సరదాగా పిలిచాను. అప్పుడు నా గెటప్ సరిగ్గా సెట్ అయిందని అనుకున్నాను.
– చరణ్ తో నటించడం ఇది రెండోసారి. ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రం టైంలో రామ్ చరణ్ చాలా యంగ్. ఇప్పుడు గ్లోబల్ స్థాయికి ఎదిగాడు. రామ్ చరణ్ నన్ను ఎప్పుడూ అన్నా అని ఆప్యాయంగా పిలుస్తాడు.
– ప్రస్తుతం ఎలివేషన్స్‌తో పాటు కథను చెబితే బాగా ఆదరిస్తున్నారు. కొన్ని చిత్రాలు ఎలివేషన్స్‌తోనే ఆడుతున్నాయి. ఈ చిత్రంలో కథతో పాటు ఎలివేషన్స్ ఉంటాయి. ఈ మధ్య శంకర్ గారు తీసిన చిత్రాలు మిస్ ఫైర్ అయి ఉండొచ్చు. కానీ ఇది మాత్రం అస్సలు మిస్ ఫైర్ కాదు. ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి.
– శంకర్ గారి ప్రతీ సినిమాల్లో ఉండేలానే ఇందులోనూ సామాజిక సందేశం ఉంటుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ అప్పన్న పాత్రను పోషించిన తీరు చూస్తే అంతా షాక్ అవుతారు. చాలా కొత్తగా అనిపిస్తాడు చరణ్. నటుడిగానూ కొత్తదనం చూస్తారు.