ఇటీవలే రవితేజ చేతికి సర్జరీ జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. కనీసం 4-5 వారాల పాటు సినిమాలకు దూరంగా ఉండాల్సిందే. అందుకే రవితేజ షూటింగ్ షెడ్యూల్ ను నిర్మాతలు రద్దు చేశారు.
ప్రస్తుతం తన 75వ సినిమా చేస్తున్నాడు రవితేజ. ఈ సినిమాను సంక్రాంతికి షెడ్యూల్ చేశారు. కానీ చేతిగాయం కారణంగా ఈ సినిమా సంక్రాంతికి రావడం కష్టంగా మారింది. దీంతో ప్రస్తుతానికి సంక్రాంతి రేసులో చిరంజీవి, వెంకటేష్ మాత్రమే మిగిలారు.
వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు చిరంజీవి. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేయబోతున్నారు.
ఇక అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు వెంకటేశ్. దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాను కూడా సంక్రాంతికే షెడ్యూల్ చేశారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. నాగార్జున సినిమా సంక్రాంతికి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే, ఆయన ఇప్పటివరకు సినిమా ఎనౌన్స్ చేయనేలేదు.
ALSO READ: Nagarjuna skips ‘Sankranthi film’ for special roles