
మాళవిక మోహనన్ కి ఇన్ స్టాగ్రామ్ లో తెగ క్రేజ్. ఆమెకి హీరోయిన్ గా ఇప్పటివరకు వచ్చిన గుర్తింపు అంతా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోల కారణంగానే.
విజయ్ సరసన “మాస్టర్” వంటి పెద్ద సినిమాల్లో నటించినా పెద్దగా క్రేజ్ రాలేదు. కానీ రీసెంట్ గా విక్రమ్ హీరోగా రూపొందిన “తంగలాన్” చిత్రంలో ఆమె పోషించిన పాత్రకు మంచి ప్రసంశలు దక్కాయి. ముఖ్యంగా ఆ సినిమాలో ఆమె గెటప్, ఆమె నటన పూర్తిగా ఆర్ట్ సినిమాల తరహాలోనే సాగింది. ఇన్ స్టాగ్రామ్ లో తెగ గ్లామర్ ఒలకబోసే ఈ భామ దక్షిణాది చిత్రాల్లో (మాస్టర్, తంగలాన్) డీగ్లామర్ గా కనిపిస్తోంది.
ఇక హిందీలో మాత్రం తన ఇన్ స్టాగ్రామ్ ఇమేజ్ కి తగ్గట్లు నటిస్తోంది.
ఆమె తాజాగా హిందీలో “యుధ్ర”(Yudhra) అనే సినిమా చేస్తోంది. ఈ సినిమాలో సిద్ధాంత్ చతుర్వ్వేది హీరో. ఈ సినిమాలో ఒక పాటలో సిద్ధాంత్ తో కలిసి చేసిన హాట్ రొమాన్స్, ఎక్స్ పోజింగ్ కుర్రకారును ఆకట్టుకుంటున్నాయి. ఇది కదా మాకు కావాల్సింది అంటూ ఆమెకే ట్విట్టర్లో మెసేజ్ పెడుతున్నారు.
ఈ భామ తాజాగా ప్రభాస్ సరసన “ది రాజా సాబ్”, కార్తీ సరసన “సర్దార్ 2” సినిమాల్లో నటిస్తోంది. ఈ సినిమాల్లో ఆమె పాత్రలు ఎలా ఉంటాయో చూడాలి. ఈ రెండూ వచ్చే ఏడాది విడుదల అవుతాయి.