చిరంజీవి మరోసారి వరుసపెట్టి సినిమాలకు సైన్ చేస్తున్నారు. ఇప్పటికే శ్రీకాంత్ ఓదెలతో చేయబోయే సినిమాను అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే ఆయన అనీల్ రావిపూడి దర్శకత్వంలో కూడా పనిచేయబోతున్నారు. తాజాగా ఈ విషయాన్ని అనిల్ రావిపూడి నిర్థారించాడు.
ఇలా వరుసగా సినిమాలు చేస్తున్న క్రమంలో చిరంజీవి తన రెమ్యూనరేషన్ ను కూడా పెంచినట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా శ్రీకాంత్ ఓదెలతో చేయబోయే సినిమా కోసం కెరీర్ లోనే అత్యథిక పారితోషికాన్ని ఆయన తీసుకుంటున్నారనేది టాలీవుడ్ టాక్.
ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ గ్యాంగ్ స్టార్ మూవీ చేయబోతున్నారు చిరంజీవి. మరో హీరో నాని, ఈ సినిమాకు ప్రజెంటర్ గా వ్యవహరించబోతున్నాడు. ఈ ప్రాజెక్టుకు ఏకంగా 75 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారట చిరంజీవి.
కంప్లీట్ యాక్షన్ ఎలిమెంట్స్ తో రాబోతున్న ఈ సినిమాలో చిరంజీవికి హీరోయిన్ ఉండదు. అంతేకాదు, ఇందులో పాటలు కూడా ఉండవంట. అనిరుధ్ ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించబోతున్నాడు.