ఈ ఏడాది (2024)లో మీనాక్షి చౌదరి ఏకంగా ఆరు సినిమాల్లో నటించింది. అందులో అయిదు విడుదల అయ్యాయి. ఆమె 2024లో నటించిన ఆరో చిత్రం “సంక్రాంతికి వస్తున్నాం.” ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14, 2025న థియేటర్లలోకి రానుంది.
ఈ మొత్తం అరడజను చిత్రాల్లో ఆడిన ఒకే ఒక్క చిత్రం.. లక్కీ భాస్కర్.మిగతావన్నీ ఫ్లాపులు. ఆమె నటించిన ఒక తమిళ్ చిత్రం (గోట్) వసూళ్లు సాధించింది కానీ ఆమెని ఎవరూ పట్టించుకోలేదు. “గుంటూరు కారం”లో ఆమె పాత్ర జూనియర్ ఆర్టిస్ట్ కి ఎక్కువ సైడ్ క్యారెక్టర్ కి తక్కువ. ఇక ఇతర చిత్రాలైన మెకానిక్ రాకీ, మట్కా దారుణంగా పరాజయం పాలు అయ్యాయి.
అయినా ఆమెకి ఇంకా కొత్తగా అవకాశాలు వస్తుండడం విశేషం. తాజాగా ఆమెని “అనగనగా ఒక రాజు” చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా తీసుకున్నారు. అంటే 2025లో కూడా కూడా “సంక్రాంతికి వస్తున్నాం”, “అనగనగా ఒక రాజు” అనే రెండు చిత్రాలు విడుదల అవుతాయి. మరో ఒకటో, రెండో కొత్త చిత్రాలు కూడా ఆమె వళ్ళో వాలుతాయి. ఆ లెక్కన 2025లో కూడా మూడు, నాలుగు చిత్రాలు చేసినట్లు అవుతుంది. అంటే ఆమె ఫ్లాపులతో సంబంధం లేకుండా ఆఫర్లు తెచ్చుకుంటోంది.
ఆమె ఇప్పటివరకు నటించిన ఏ సినిమాల్లో కూడా గ్లామరస్ గా కనిపించలేదు. నటన కూడా గొప్పగా చేసింది లేదు. అయినా ఆఫర్లు వస్తున్నాయంటే గ్రేట్.