
జాన్వీ కపూర్ చెల్లెలు ఖుషి కపూర్ నటించిన రెండో సినిమా కూడా విడుదల అయింది. మొదటి సినిమా ఎలా ఓటిట్లో రిలీజ్ అయిందో… రెండో సినిమా కూడా డైరెక్ట్ గా ఓటిటిలోకి వచ్చింది. తాజాగా మూడో చిత్రం కూడా నెట్ ఫ్లిక్స్ లోనే విడుదలైంది.
“నదానియా” (Nadaaniyan) అనే ఈ చిత్రం ఈ నెల 7న నెట్ ఫ్లిక్స్ లో ప్రీమియర్ అయింది. సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీంకి ఇది మొదటి చిత్రం, ఖుషికిది మూడో చిత్రం. ఇంతకుముందు “ది ఆర్చీస్” (The Archies), “లవ్యపా” (Loveyapa) సినిమాల్లో నటించింది.
క్రిటిక్స్ అందరూ హీరో, హీరోయిన్ల నటన గురించి ఓకే మాట చెప్పారు. ఇద్దరికీ నటనలో ఓనమాలు కూడా తెలియవు అని తేల్చారు. ఇబ్రహీంకి మొదటి సినిమా కాబట్టి క్షమించొచ్చు. ఖుషికిది మూడో సినిమా ఎంతో కొంత ఎక్స్ ప్రెషన్లు అయినా ఇవ్వాలి కదా. అందుకే క్రిటిక్స్ ఆమె నటన పూర్ అంటూ ఎక్కువ విమర్శలు చేశారు.
శ్రీదేవి నటన, అభినయం రెండింట్లో బెస్ట్. ఆమె మొదటి కూతురు అందంలో అదుర్స్. నటన గొప్పగా లేకపోయినా ఒక గ్లామర్ హీరోయిన్ కి కావాల్సినంత ఎక్స్ ప్రెషన్లు ఇస్తుంది. ఖుషి కపూర్ మాత్రం రెండింట్లో వీక్ అని అంటున్నారు.

మరి, ఈ భామ మరింత కష్టపడి నిలబడుతుందా? మూడు సినిమాల తర్వాత కూడా ఏమి నేర్చుకోలేద అనే మాటతో డీలా పడుతుందా?