
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తనతో కలిసి పని చేసిన మహిళలకు అలాగే ఇతర మహిళామణులకు తన సోషల్ మీడియా వేదిక పైన శుభాకాంక్షలను తెలియజేశారు. తాజాగా హీరోయిన్ శ్రీలీలని కూడా సత్కరించారు.
చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమా షూటింగ్ లో ఉన్నారు. అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరుగుతోంది. అదే స్టూడియోలో మరో ఫ్లోర్ లో శ్రీలీలకి సంబంధించిన మరో సినిమా షూటింగ్ జరుగుతోంది. చిరంజీవి పక్క ఫ్లోర్ లోనే ఉన్నారని తెలుసుకున్న శ్రీలీల విశ్వంభర సెట్స్‌కు వెళ్లి చిరంజీవి గారిని కలిశారు.
మహిళా దినోత్సవం సందర్భంగా తనను కలిసిన శ్రీలీలకు శాలువా కప్పి ఆమె ప్రతిభని, ఆమె విజయాన్ని మెచ్చుకున్నారు. తక్కువ టైంలో మంచి పాపులారిటీ తెచుకున్నందుకు అభినందించారు. అలాగే ఆమెకి దుర్గాదేవి రూపం ముద్రించిన శంఖాన్ని బహుమతిగా బహుకరించారు మెగా స్టార్ చిరంజీవి.
ALSO READ: త్వరలో శ్రీలీల మరో ప్రకటన
మెగాస్టార్ నుంచి వచ్చిన ఈ ప్రత్యేకమైన బహుమతిని అందుకున్న శ్రీలీల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఫొటోలను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశారు.