
కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో రాబోతోంది “భారతీయుడు-2”. ఈ సినిమాని రెండు భాగాలుగా విడదీసి “భారతీయుడు 2”, “భారతీయుడు 3” అని విడుదల చెయ్యనున్నారు. కమల్ హాసన్ సరసన కాజల్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసింది. ఐతే . “భారతీయుడు-2” సినిమాలో కాజల్ దాదాపుగా కనిపించదంట.
అవును.. “భారతీయుడు-3″లో కాజల్ కనిపిస్తుందట. ఈ విషయాన్ని కోలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ బయటపెట్టాడు దర్శకుడు శంకర్. భారతీయుడు-2లో కాజల్ కనిపించేది చాలా తక్కువని, కాజల్ ఉందనే విషయాన్ని కూడా ప్రేక్షకులు గుర్తించరని అంటున్నాడు శంకర్. అందుకే, ఇందులో కొంచెం సేపు మాత్రమే చూపించి, మూడో భాగంలో ఇంకా ఎక్కువ సేపు ఆమెని చూపిస్తారంట.
ఇక సినిమా అసలు ప్లాట్ విషయానికొస్తే, భారతీయుడు -2 స్టోరీ ఎక్కువగా సిద్దార్థ్ చుట్టూ తిరుగుతుందట. అతడితో పాటు బాబీ సింహా, రకుల్ ప్రీత్ ఎక్కువగా కనిపిస్తారట. సిద్దార్థ్ చొరవతో సేనాపతి (కమల్ హాసన్) భారత్ లో అడుగుపెట్టడం భారతీయుడు-2 స్టోరీ అని తెలుస్తోంది.
జులై 12న భారతీయుడు-2 రిలీజ్ అవుతుంది. వచ్చే ఏడాది జనవరిలో భారతీయుడు-3 థియేటర్లలోకి వస్తుంది.
ALSO CHECK: Kajal has sunshine in her pocket!