
నటీనటులు స్క్రీన్ పై పేర్లు మార్చుకోవడం కామన్. కమల్ హాసన్, చిరంజీవి, రజనీకాంత్ లాంటి ఎంతోమంది స్టార్స్ పేర్లు మార్చుకున్నారు. ఇక హీరోయిన్లలో కూడా చాలామంది పేర్లు మార్చుకున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి హీరోయిన్ ఇవానా కూడా చేరింది.
తన అసలు పేరు ఇవానా కాదంటోంది ఈ బ్యూటీ. ఈమె అసలు పేరు ఎలీనా షాజీ అంట. పేరు మార్చుకోమని దర్శకుడు బాల, ఈమెకు సూచించాడట. అలా తన పేరును ఇవానాగా మార్చుకుంది ఈ చిన్నది.
‘లవ్ టుడే’తో హిట్ కొట్టిన ఈ బ్యూటీ, రీసెంట్ గా ‘సింగిల్’ (#Single) సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా సక్సెస్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఇవానా, తనకు ఎదురైన బాడీ షేమింగ్ అనుభవాన్ని బయటపెట్టింది.
ఇవానా కాస్త పొట్టిగా ఉంటుంది. దీంతో ఆమెను అంతా పొట్టి పొట్టి అని పిలిచేవారంట. ఈ బాడిషేమింగ్ తో సరిగ్గా చదవలేకపోయిందట ఇవానా. అయినా ఎలాగైనా సినిమాల్లో రాణించాలనే కసితో పొట్టిగా ఉన్నప్పటికీ గట్టిగా ప్రయత్నించి సక్సెస్ అయ్యానంటోంది ఇవానా.