
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఇక థియేటర్లు మూతపడుతాయి. జూన్ 1 నుంచి థియేటర్లను బంద్ చెయ్యాలని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారు.
అద్దె రూపంలో సినిమాలు నడపలేమని, పర్సెంటీజి సిస్టం కావాలని చాలా కాలంగా ఎగ్జిబిటర్లు అడుగుతున్నారు. ఆదివారం ఇదే విషయమై ఫిలిం ఛాంబర్ లో సమావేశం అయి ఇక జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమాలు నడపొద్దని నిర్ణయించుకున్నారు. తమ డిమాండ్లకు ఇప్పుకుంటేనే జూన్ 1న కూడా థియేటర్లు నడుస్తాయి అని ఎగ్జిబిటర్లు అంటున్నారు. అంటే ఇది అల్టిమేటం.
నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య సయోధ్య కుదిరితే ఈ బంద్, గిందు ఉండదు.
ఇప్పుడు థియేటర్ల వాళ్ళు అడుగుతున్నది … మల్టిప్లెక్స్ పద్దతిలో రెవెన్యూ. అలా ఐతే చాలా నష్టపోతాం అని నిర్మాతలు అంటున్నారు.