
మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య గొడవల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఈ అన్నదమ్ముల మధ్య ఇప్పటికే మంటలు రేగి ఉన్నాయి. ఎన్ని ఫైర్ ఇంజిన్లు వచ్చినా తగ్గేలా లేవు. ఐతే, విష్ణు తన తమ్ముడు గురించి బహిరంగంగా ఎక్కువగా మాట్లాడడు కానీ మనోజ్ మాత్రం ఛాన్స్ వచ్చిన ప్రతిసారి తన అన్నపై సెటైర్లు వేస్తూనే ఉంటాడు.
తాజాగా తన కొత్త చిత్రం “భైరవం” ట్రైలర్ వేడుకలో కూడా విష్ణుపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
మంచు విష్ణు హీరోగా నటించిన “కన్నప్ప” సినిమా వచ్చే నెల విడుదల కానుంది. ఆ సినిమాలో “శివయ్యా” అని విష్ణు పలికే డైలాగ్ ఉంది.
మనోజ్ ఆ డైలాగ్ పై సెటైర్ వేశాడు. “శివయ్యా అని పిలిస్తే దేవుడు కరుణించడు. శివయ్యా రావాలంటే శివుడిని మంచి మనసుతో కోరుకోవాలి,” అని తన స్పీచ్ మొదలెట్టాడు. జనం నవ్వారు.
నన్ను కట్టుబట్టలతో రోడ్డు మీదకు తెచ్చారు. నేను ఊరు వెళ్లొచ్చేసరికి అన్నీ రోడ్డు మీద పెట్టారు. బయటకు వెళ్లడానికి కార్లు లేకుండా చేశారు. కానీ.. నాకు ఆ శివుడు ఫ్యాన్స్ రూపంలో వచ్చి.. ఇంటి బయట 20 కార్లు పెట్టించాడు,” అంటూ దేవుడు తనవైపు ఉన్నాడు అని చెప్పాడు.