
కోపం అందరికీ వస్తుంది. దీనికి హీరోలు కూడా అతీతం కాదు. అలా కోపం వచ్చినప్పుడు కూల్ అవ్వడానికి ఒక్కొక్కరికి ఒక్కో మార్గం ఉంటుంది. అయితే వెంకీది అంతా డిఫరెంట్ స్టయిల్. మరి కోపం వస్తే ఆయనేం చేస్తారు.
ఇక్కడే ఓ గమ్మత్తైన విషయం బయటపెట్టారు వెంకటేశ్. తనకు అసలు కోపం రాదనేది ఆయన సమాధానం. తను ఎప్పుడూ కూల్ గా ఉంటానని, ఎవరో వచ్చి తనను కూల్ చేయాల్సిన అవసరం లేదంటారాయన.
జీవితంలో ఎలాంటి టెన్షన్లు పెట్టుకోనని, ఎదుటి వ్యక్తితో వాగ్వాదం పెట్టుకోనని, అలాంటప్పుడు తనకు కోపం ఎందుకు వస్తుందని రివర్స్ లో ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, తన దగ్గర సీక్రెట్స్ కూడా ఉండవంటున్నారు.
వెంకీ వాడుతున్న ఫోన్ కు పాస్ వర్డ్ కూడా ఉండదంట. ఫేస్ లాక్ లాంటివి తను పెట్టుకోనని, మిగతా కోడ్స్ అన్నీ తన కుటుంబంలో అందరికీ తెలుసని, తన ఫోన్ లో ఎలాంటి సీక్రెట్స్ ఉండవని అంటున్నారు వెంకీ. గడిచిన పాతికేళ్లుగా ప్రశాంతంగా ఉండడంపై ఆయన ప్రాక్టీస్ చేస్తున్నారు. దాదాపు ఆయన సాధించారు.