ఉన్నట్టుండి సడెన్ గా కోలీవుడ్ లో బిజీ అయింది పూజాహెగ్డే. బాలీవుడ్ ప్రాజెక్టు పూర్తి చేసిన వెంటనే కోలీవుడ్ కు షిఫ్ట్ అయిన ఈ బ్యూటీ, ఆల్రెడీ ఓ సినిమా పూర్తిచేసింది. ఇప్పుడు మరో సినిమా ఓపెన్ చేసింది.
సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమాను పూర్తిచేసింది పూజాహెగ్డే. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఇక రీసెంట్ గా విజయ్ హీరోగా హెచ్.వినోద్ దర్శకత్వంలో ఓ సినిమాను లాంచ్ చేసింది. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వస్తుంది.
ఏడాదిన్నరగా ఖాళీగా ఉన్న పూజా హెగ్డే, ఇలా కోలీవుడ్ లో వరుసగా అవకాశాలు దక్కించుకోవడానికి కారణం ఏంటి? దీనికి ఒకే ఒక కారణం చెబుతున్నారు తమిళ జనం. ఆమె తన పారితోషికాన్ని అమాంతం తగ్గించుకుందట.
ALSO READ: A new boost to Pooja Hegde’s career
ఒకప్పుడు సినిమాకు 3 కోట్ల వరకు తీసుకునేది పూజాహెగ్డే. ఇప్పుడా మొత్తాన్ని ఆమె భారీగా తగ్గించుకుందని చెబుతున్నారు. తను తగ్గించుకోవడం మాత్రమే కాదు, తన స్టాఫ్ ను కూడా తగ్గించుకుందట. దీంతో నిర్మాతకు ఆ ఖర్చులు కూడా కలిసొచ్చాయి.
అలా రేటు తగ్గించుకోవడం వల్ల ఆమెకు అవకాశాలొస్తున్నాయంట.