
పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్న తర్వాత కూడా సినిమాల్లో కొనసాగుతున్నారు చాలామంది హీరోయిన్లు. ఇప్పుడలాంటి భ్రమలు ఎవ్వరికీ లేవు. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకొని మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నారు. మరోవైపు సినిమాలు కూడా కొనసాగిస్తున్నారు. అయితే జెనీలియాకు మాత్రం ఈ విషయంలో ఇబ్బంది ఎదురైంది.
అందరు హీరోయిన్లలానే ఈమె కూడా పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత తల్లి కూడా అయింది. అయితే ఈ క్రమంలో కెరీర్ లో ఏకంగా 10 ఏళ్లు గ్యాప్ వచ్చేసింది. అయినప్పటికీ ఆమె మరోసారి నటించాలనుకుంది. కానీ తనకు సరైన ప్రోత్సాహం దొరకలేదంటోంది ఈ మాజీ హీరోయిన్.
పదేళ్ల విరామం తర్వాత తిరిగి కెమెరా ముందుకొస్తానంటే ఆమెను చాలామంది నిరుత్సాహపరిచారంట. అప్పటికీ ఇప్పటికీ ఇండస్ట్రీలో పరిస్థితులు బాగా మారిపోయాయని, ఎడ్జెస్ట్ అవ్వలేవు వద్దని అన్నారట. అయితే జెనీలియా మాత్రం ధైర్యం చేసింది.
భర్త రితేష్ తో కలిసి ఓ సినిమా చేసింది జెనీలియా. అలా సక్సెస్ ఫుల్ గా రీఎంట్రీ ఇచ్చానని చెప్పుకొచ్చింది. కొన్ని విషయాల్లో పక్కోళ్లు చెప్పిన మాటలు వినకూడదని, మనసుకు నచ్చింది చేయాలని, తన జీవితంలో జరిగిన ఘటనే దానికి సరైన ఉదాహరణ అని చెబుతోంది. ఇదే ఊపులో ఈ హీరోయిన్ టాలీవుడ్ లో అడుగుపెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.