
‘లైగర్’ లాంటి డిజాస్టర్.. ఆ తర్వాత ‘డబుల్ ఇస్మార్ట్’ రూపంలో మరో పెద్ద ఫ్లాప్. దీనికితోడు ‘లైగర్’తో కొన్ని ఆర్థిక వివాదాలు కూడా తలెత్తాయి. ఇలా వరుసపెట్టి అన్నీ ప్రతికూల ఘటనలే జరగడంతో పూరి జగన్నాధ్, ఛార్మి అనుబంధంపై చాలామందికి అనుమానాలు పెరిగాయి.
ఇన్నాళ్లూ కలిసి పనిచేసిన ఈ జంట, ఇకపై ఎవరి దారి వారు చూసుకున్నారనే ప్రచారం నడిచింది. దీనికి మరింత ఊతమిస్తూ, పూరి జగన్నాధ్ ఒక్కడే స్వయంగా కొంతమంది నిర్మాతలతో టచ్ లోకి వెళ్లినట్టు వార్తలొచ్చాయి. ఇలా ఒకటి, రెండు కాదు… ఈ మధ్య పూరి-చార్మి బంధంపై చాలా గాసిప్స్ వచ్చాయి.
ఎట్టకేలకు ఈ పుకార్లన్నింటికీ తమదైన స్టయిల్ లో చెక్ పెట్టింది ఈ జంట. విజయ్ సేతుపతితో కలిసి దిగిన ఫొటోను ఈరోజు రిలీజ్ చేసింది ఈ జంట. తమ తదుపరి చిత్రాన్ని ఈ హీరోతోనే చేయబోతున్నట్టు వాళ్లు ప్రకటించారు.
ALSO READ: Puri Jagannadh to direct Vijay Sethupathi in a new film
ఈ ఒక్క ఫొటోతో ఇన్నాళ్లూ నడిచిన పుకార్లకు తెరపడింది. పూరి-చార్మి కాంబినేషన్ ఎప్పట్లానే కలిసి పనిచేయబోతోంది. ఎన్ని ఫ్లాపులొచ్చినా, ఇంకెన్ని వివాదాలు చుట్టుముట్టినా తమ బంధాన్ని ఎవ్వరూ బ్రేక్ చేయలేరని ఈ ఒక్క ఫొటోతో పరోక్షంగా వెల్లడించింది ఈ జంట.