
మలయాళంలో మంచి టాలెంట్ ఉంది. సరైన పాత్రలు పడితే వాళ్లు తెలుగులో కూడా మెరుస్తారు. కానీ అలాంటి పాత్రలు పడడం లేదు, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ షైన్ టామ్ చాకో (Shine Tom Chacko). మలయాళంలో మంచి నటుడు. కానీ తెలుగులో మాత్రం సరైన క్యారెక్టర్స్ పడడం లేదు.
‘దసరా’ సినిమా ఇతడికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయి సినిమా పడలేదు. నాగశౌర్య నటించిన ‘రంగబలి’ సినిమాలో విలన్ గా నటించాడు టామ్ చాకో. కానీ అది వర్కవుట్ కాలేదు.
ఆ తర్వాత ‘డాకు మహారాజ్’ లాంటి సినిమా చేశాడు. ఉన్నంతలో ఓకే అనిపించినా అతడికి ఆశించిన గుర్తింపు రాలేదు. ఇప్పుడు ‘రాబిన్ హుడ్’ లో అంతకంటే దారుణమైన పాత్ర పోషించాడు. అతడు పోషించిన విక్టర్ అనే పోలీసాఫీసర్ పాత్ర, సినిమాకే కాదు, అతడి కెరీర్ కు కూడా పనికిరాదు.
ఇకపై టాలీవుడ్ లో రొటీన్ పాత్రలని చాకో ఆపేస్తే అతడి కెరీర్ కు మంచిదేమో. కేవలం చాకో విషయంలోనే కాదు, చాలామంది మలయాళ నటులు టాలీవుడ్ లో ఫెయిల్ అయ్యారు.