ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్ విడిపోయ చాలా కాలమే అయింది. 18 ఏళ్ల కాపురం తర్వాత వీరు 2022లో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇటీవలే కోర్టులో విడాకుల కోసం పిటిషన్ పెట్టుకున్నారు. తాజాగా చెన్నైలోని ఫ్యామిలీ కోర్టు నుంచి వీరికి పిలుపు వచ్చింది.
అక్టోబర్ 7న కోర్టు ముందు ఇద్దరూ వ్యక్తిగతంగా హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు.
ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్ ఇద్దరూ తమ అభీష్టం మేరకు విడాకులు తీసుకుంటున్నామని, ఇందులో ఎవరూ ఒత్తిడి లేదని, ఇక కలిసి ఉండే పరిస్థితి లేదని న్యాయమూర్తికి చెప్పితేనే విడాకులు వస్తాయి. సాధారణంగా న్యాయమూర్తులు మరోసారి ఆలోచించుకోమని సలహా ఇస్తారు విడాకులు కోరుకునే జంటకు. కొంత టైం కూడా ఇస్తారు. ఐతే, వీరిని అక్టోబర్ 7న రమ్మని చెప్పారంటే ఇంకా టైం ఇవ్వకపోవచ్చు.
ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్ 2004లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు.
ధనుష్ త్వరలోనే మళ్ళీ పెళ్లి చేసుకుంటారు అనే టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ధనుష్ తెలుగులో శేఖర్ కమ్ముల తీస్తున్న “కుబేర” చిత్రంలో నటిస్తున్నాడు.