రాశి ఖన్నా కొంతకాలంగా గ్లామర్ షోపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో ఆమె సెక్సీ ఫోటోలను అప్డేట్ చేస్తూ వస్తోంది. జనాలని ఆకట్టుకోవాలని ప్రయత్నం అది. మొత్తానికి ఈ ట్రిక్ పనిచేసింది.
రాశి ఖన్నాకు ఇప్పుడు టాలీవుడ్ లో ఒక పెద్ద సినిమా దక్కింది. నితిన్ సరసన నటించే అవకాశం అది. “రాబిన్ హుడ్” అనే పేరుతో దర్శకుడు వెంకీ కుడుముల తీస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా సెలెక్ట్ అయిందట. నిజానికి ఈ అమ్మడికి ఈ సినిమా దక్కడం ఒక విధంగా లక్ అనే చెప్పాలి.
“రాబిన్ హుడ్” సినిమా ముందు రష్మిక మందాన హీరోయిన్ గా స్టార్ట్ అయింది. “భీష్మ” సినిమాలో నితిన్, రష్మిక నటించడం, వెంకీ కుడుముల ఆ సినిమాకి దర్శకుడు కావడంతో తమ ముగ్గురి హిట్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తున్నామని అప్పట్లో ఘనంగా ప్రకటించారు. కానీ కొద్ది రోజులకే రష్మిక ఆ సినిమా నుంచి తప్పుకొంది.
రష్మిక తప్పుకోవడంతో శ్రీలీలని తీసుకోవాలని అనుకున్నారు. కానీ నితిన్, శ్రీలీల ఇంతకుముందు “ఎక్స్ట్రా” అనే సినిమాలో నటించారు. అది ఫ్లాప్ అయింది. దానికి తోడు శ్రీలీల నటించిన సినిమాలు ఏవీ ఈ మధ్య సరిగా ఆడలేదు. దాంతో శ్రీలీల బదులు వేరే హీరోయిన్ ని తీసుకోవాలని అనేక పేర్లు పరిశీలించి రాశి ఖన్నాని ఫైనలైజ్ చేసినట్లు చెప్తున్నారు.
ఇటీవల రాశి ఖన్నా ఒక తమిళ చిత్రం చేసింది. తమన్నాతో కలిసి నటించిన ఆ హారర్ కామెడీ తెలుగులో ‘బాక్’ అనే పేరుతో విడుదల కానుంది. ఈ సినిమాలో ఒక పాటలో తమన్నా, రాశి ఖన్నా రెచ్చిపోయి గ్లామర్ షో చేశారు. ఇలా గ్లామర్ షోతో ఆమె కొత్త అవకాశాన్ని పొందింది.