అనుపమ పరమేశ్వరన్ కి మంచి క్రేజుంది. సక్సెస్ రేట్ కూడా ఎక్కువే. అందమూ ఉంది. అభినయమూ వచ్చు. ఇంకా చెప్పాలంటే కుర్రాళ్లను ఆకట్టుకునేలా ఈ మధ్య గ్లామర్ డోస్ బాగా పెంచింది.
అన్ని అనుకూలతలు ఉన్నా ఆమె తెలుగులో అంతగా బిజీగా లేదు. ఆమె సినిమాలు పెద్దగా ఒప్పుకోవడం లేదా అవకాశాలు అంత ఎక్కువగా రావడం లేదా అన్నది తెలియడం లేదు.
ALSO CHECK: Anupama Parameswaran’s selfie time in a Saree
ఇటీవలే ఆమె “టిల్లు స్క్వేర్”తో భారీ హిట్ అందుకొంది. ఆ సినిమాలో ఆమె రెచ్చిపోయి నటించింది. ఇక వరుసగా పెద్ద సినిమాలు ఆమె వల్లో వాలుతాయి అని భావించారు. కానీ ఆమె ఇప్పుడు తెలుగులో కన్నా తమిళ, మలయాళ సినిమాలతో బిజీగా ఉంది. ఆమె ఎప్పుడో నటించిన “పరదా” అనే ఒక లేడి ఓరియెంటెడ్ తెలుగు చిత్రం మాత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.
ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక తెలుగులో పెద్ద హీరోల సరసన ఇంతవరకు నటించలేదు. ఆ అవకాశం కోసం చూస్తున్నట్లు ఉంది.